వెల్లంకి లక్ష్మీ నారాయణకు సీపీఐ నాయకుల ఘన నివాళి

మహా తెలంగాణ గార్ల :

సిపిఐ సీనియర్ నాయకులు రాంపురం గ్రామ శాఖ మాజీ కార్యదర్శి కామ్రేడ్ ఎల్లంకి లక్ష్మీనారాయణ 5వ వర్ధంతిని సీపీఐ గార్ల మండల సమితి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పాకాల ఎటి ఒడ్డున గల వారి స్మారక స్థూపం వద్ద గురువారంనాడు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కట్టేబోయిన శ్రీనివాస్,మాట్లాడుతూ వెల్లంకి లక్ష్మి నారాయణ ఆయన జీవితమంతా బడుగు బలహీన వర్గాల బాగుకోసం తపించారన్నారు. గ్రామ అభివృద్ఫై కోసం, రామాపురం గ్రామానికి రహదారి సైకార్యం అయిన పాకాల ఏటిపై హై వంతెన కొరకు తుది శ్వాస వరకు పోరాలు జరిపారని గుర్తుచేసుకున్నారు. ఆయన ఆశయ సాధన కొరకు సీపీఐ పార్టీ కృషి చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి జంపాల వెంకన్న, సింగు రమేష్, దార్ల నాగేష్, లావుడ్య భీముడు,గుండా సుధాకర్ రెడ్డి, సిరిమర్తి నాగరాజు,లాలూ,వెంకన్న, తదితులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *