ఘనంగా ఎంపీ పోరిక బలరాం నాయక్ జన్మదిన వేడుకలు

మహా తెలంగాణ /గార్ల

మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ జన్మదినాన్ని పురస్కరించుకొని గార్ల మండల కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
గార్ల మండల కేంద్రంలోని నెహ్రు కూడలిలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దనియకుల రామారావు అధ్యక్షతన కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రావూరి వెంకటరామయ్య, సూరారం రెడ్డి, వెంకట్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బలరాం నాయక్ గతంలో కేంద్ర మంత్రిగా, ఎంపీ గా ఈ మండలానికి, ఈ ప్రాంతానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎంపీ నాయకత్వంలో పనిచేస్తామని, కాంగ్రెస్ కార్యకర్తలందరం ఐక్యంగా ముందుకు వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో
మాలోత్ వెంకట్లాల్, గుండా వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు శివాజీ, శ్రీనివాస్, జిల్లా నాయకులు బాపనపల్లి సుందర్, గుగులోతు శ్రీనివాస్, సర్పంచులు బాధావత్ రవి, గుగులోతు రమేష్, అజ్మీర బాబురావు, ప్రమీల బాధావత్, ప్రసాద్, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *