మహబూబాబాద్ :
మహబూబాబాద్ జిఇసిఓ గా యాద్దనపూడి గాయత్రి నియామకమయ్యారు. ఈమేరకు మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖధికారి సత్యనారాయణ మూర్తి ని మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధతతో కార్యదీక్షతో పనిచేయాలని జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని, విద్యాశాఖలో అన్ని రంగాలలో మహబూబాబాద్ జిల్లాకు ఒక ప్రత్యేకత గుర్తింపు ఉందని, జిల్లా బాలికల్లో సృజనాత్మక శక్తిని వెలికితీసి ఉత్తమ విద్యార్థులుగా తీర్చి దిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసి జిఇ మందుల శ్రీరాములు, ఎఫ్ఏఓ శంకర్ నాయక్, కోఆర్డినేటర్లు పూర్ణచందర్, సురేష్, వేంకటేశ్వర్లు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.