ప్రభుత్వ బడులు బలోపేతం చేయాలి

జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి

మహాతెలంగాణ/మహబూబాబాద్

ప్రభుత్వ బడులు బలోపేతం చేయాలని ప్రభుత్వ బడుల్లో అర్హతలు కలిగినటువంటి ఉపాధ్యాయులతో విద్యాబోధన ఉంటుందని మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి అన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పత్తిపాక ప్రాథమిక పాఠశాలలో మంగళవారం బడిబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడులలో అడ్మిషన్ల శాతం పెంచేందుకు కృషి చేయాలని అందుకు విద్యాశాఖ తరఫున పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులకే విద్యాబోధన ద్వారా విద్యార్థులు మంచి విజ్ఞానంతో పాఠశాల నుంచి బయటికి వెళ్తారని విద్యార్థుల తల్లిదండ్రులకు డీఈవో సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నూతనంగా అడ్మిషన్ తీసుకుంటున్న రాజేష్,అమూల్య, సుధీర్, తరుణ్ విద్యార్థులకు అడ్మిషన్ దరఖాస్తు తీసుకొని ప్రవేశ కల్పించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంఈఓ వెంకటేశ్వర్లు, ఏఎమ్ఓ వెంకటేశ్వర్లు, సురేష్, జి సి డి ఓ గాయత్రి, మైసా శ్రీనివాస్, జానీ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *