మహా తెలంగాణ/కురవి;
రైతులు తమ పొలాల్లో జీలుగు సాగు వలన భూమికి బలం చేకూరి రైతుకు లాభమని జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర, ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి అన్నారు కురవి ఆంధ్ర బ్యాంకు సొసైటిలో ఎస్ విజయ చంద్ర, నల్లు సుధాకర్ రెడ్డిలు రైతులకు జీలుగు విత్తనాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తమ భూమిలో పంట వ్యర్ధాలను కాల్చి వేయకుండా దానిలోనే కలియ దున్నాలని, ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో జీలుగు విత్తనాలను తన పొలములో చల్లడం పూత దశలోనే పొలంలో కలియ దున్నడం వలన, మొక్కకు కావలసిన నత్రజని, బాస్వరం, పొటాషియం మ్యాంగనీస్, ఇనుము క్యాల్షియం వoటి సూక్ష్మ పోషకాలను అందించడం వలన రైతులకు ఎరువుల ఖర్చు తక్కువ కావడం, పంట దిగుబడి ఎక్కువ రావడంతో రైతులకు ఎంతో మేలు కలుగుతుందని ప్రతి రైతు ప్రభుత్వo 50%తో రాయితీతో అoదించే జీలుగు విత్తనాలను తప్పకుండా తీసుకోవాలని కోరారు మహబాద్ జిల్లా వ్యవసాయ అధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ విజయ్ చంద్ర గారిని ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి, పెస్టిసైడ్స్ అసోసియేషన్ బాధ్యులు రఘుపతి, రవి దామోదర్ ఉపేందర్ తదితరులు శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నరసింహారావు, బ్యాంకు ఎండి, ఏఏవో రాజేశ్వరి, విజయేందర్, జితేందర్ లు పాల్గొన్నారు.