కురవి (మహబూబాబాద్) :
కురవి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల నందు గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేశిరాం నాయక్ అధ్యక్షతన pmrc స్టాఫ్ అలాగే జిల్లా లోని అన్ని ఆశ్రమ పాఠశాల హెడ్మాస్టర్లు, హాస్టల్ వెల్ఫేట్ ఆఫీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ గిరిజన విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య మరియు మెనూ ప్రకారం చక్కటి భోజనం అందించి వారి ఉజ్యాల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని తెలిపారు. బడి బాట కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయులు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు మరియు ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో గ్రామ గ్రామాన విస్తృతంగా తిరిగి నమోదు చేపించాలని అన్నారు. ఈ విద్యా సంవత్సరం వందకు వందశాతం పదో తరగతి ఫలితాలు సాధించాలని అందుకు తగిన ప్రణాళికలు ఇప్పటినుంచే తయారు చేసుకోవాలని తెలిపారు. తదనంతరం ఈ మధ్య రిటైర్ అయిన మరియు బదిలీపై వెళ్లిన వారిని అందరి సమక్షంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ డి. రాములు, డిప్యూటీ డి యి ఓ డి. సారయ్య, జిసిడిఓ కె. విజయ, ఎస్ ఓ సి హెచ్. కొమ్మాలు , డిఆర్పి శ్రీకాంత్ , అకౌంటెంట్ జే.సుహాసిని , స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. బాబు, వార్డెన్ బి. పద్మ మరియు అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు మరియు
SCRP లు పాల్గొన్నారు.