మహా తెలంగాణ/ కురవి
కురవి మండలం మోదుగుల గూడెం గ్రామ పంచాయతీలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన తనకం సారమ్మ కుటుంబాన్ని పరామర్శించి, టీపీసీసీ డాక్టర్ వింగ్ రాష్ట్ర నాయకులు డా. వీరన్న నాయక్ తన తండ్రి గోపా నాయక్ జ్ఞాపకార్థంగా 25 కిలోల బియ్యాన్ని అందజేశారఈ సందర్భంగా డా. వీరన్న నాయక్ మాట్లాడుతూ, కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మోదుగుల గూడెం సర్పంచ్ ప్రవీణ్, గ్రామ అధ్యక్షులు కోడి రాములు, మాధ మల్లయ్య, కందిపాటి వీరన్న, యూత్ ఉపాధ్యక్షులు మదా శ్రీకాంత్, రసాల మల్లయ్య, కందిపాటి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.