జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య వర్ధంతి

మహాతెలంగాణ/మహబూబాబాద్

జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు శ్రీ. దొడ్డి కొమరయ్య వర్ధంతి జిల్లా కలెక్టర్ గారి అనుమతితో శనివారం జిల్లా కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ అదనపు కలెక్టర్ కె అనిల్ కుమార్ అదనపు ముఖ్య అతిధిగా పాల్గొని శ్రీ.దొడ్డి కొమరయ్య గారి చిత్రపటంకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో ధొడ్డి కొమురయ్య చేసిన త్యాగాలు చిరస్మరణీయమని,ఆయన స్పూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమములో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది అధికారి CH.సాయిశ్రీజ  ,జిల్లా అధికారులు, వసతి గృహ సంక్షేమ అధికారులు, IDOC కార్యాలయ సిబ్బంది మరియు జిల్లాలోని గొల్ల, కురుమ , వివిధ కుల  సంఘాల నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *