తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్యకు ఘన నివాళి

మహాతెలంగాణ/నర్సింహులపేట:

తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా నర్సింహులపేట మండల కేంద్రంలో గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. సంఘం మండల అధ్యక్షుడు భారీ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఆయన త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా భారీ రమేష్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం చేసిన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయమని అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని, తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. యువత కొమురయ్య ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కాస యాకయ్య,రేఖ ఐలయ్య, రేఖ నర్సయ్య రేఖ వెంకన్న ఎల్లవుల ఉప్పలయ్య,మర్రి జంపయ్య, కొమ్ము లింగయ్య,రేఖ కిషోర్,రాసల నర్సయ్య, కోడి సోమయ్య కోడి లింగయ్య,రేఖ గంగయ్య, భారీ గంగయ్య తదితరులు పాల్గొని దొడ్డి కొమురయ్యకు ఘనంగా నివాళులర్పించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *