నరసింహస్వామి, బాలరాజు సేవలు మరువలేనివి

జిల్లా గిరిజన శాఖ డిప్యూటీ డైరెక్టర్ గుగులోతు దేశీ రామ్ నాయక్

మహబూబాబాద్ :

మాడిశెట్టి నరసింహస్వామి జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి, బాలరాజు ఈడి ఎస్సీ కార్పొరేషన్ ల సేవలు మరువలేనివని డిటిడబ్ల్యుఓ దేశీ రామ్ నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో సుదీర్ఘకాలం జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారిగా పనిచేసిన మాడిశెట్టి నరసింహస్వామి, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాపెల్లి బాలరాజు, ఇటీవలే పదవి విరమణ పొందిన సందర్భంగా ఆదివారం వారిని వారితో కలిసి పనిచేసిన జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది ఆత్మీయంగా సన్మానించారు. ఈ సందర్భంగా దేశీ రామ్ నాయక్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి జీవితంలో బదిలీలు, పదవి విరమణలు సహజమని, వారు పనిచేసిన చోట అంకితభావంతో ప్రభుత్వ లక్ష్యాలను అర్హులకు చేర్చడంలో కీలక పాత్ర ప్రభుత్వ ఉద్యోగులు పోషించాలన్నారు, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, శాఖల పరిధిలో క్షేత్రస్థాయిలో పేద విద్యార్థిని విద్యార్థులకు విద్యను అందించడంలో ముఖ్యపాత్ర వహించిన, నరసింహస్వామి, బాలరాజు లు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పనిచేసే అనేక సార్లు రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లు, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో ప్రశంసలు, అభినందనలు స్వీకరించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ ఆత్మీయ సమావేశంలో అధికారులు సభావట్ కృష్ణవేణి, మెప్మా ప్రాజెక్ట్ డిపిఎం విజయ, డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్, మదన్ సింగ్, టెక్నికల్ అధికారి, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *