భక్తిశ్రద్ధలతో హాజ్రత్ బాబా సాహెబ్ దర్గా ఉత్సవాలు..

డప్పు చప్పుళ్ల మధ్య పీరీల ఊరేగింపు

మహాతెలంగాణ/ నర్సింహులపేట :

మండలంలోని జయపురం గ్రామంలో హాజ్రత్ బాబా సాహెబ్ దర్గా షరీఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా జయపురం గ్రామం నుంచి పీరీలను ఊరేగింపుగా తీసుకువచ్చారు.బుధవారం మండల కేంద్రంలో పీరీల ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది. డప్పు చప్పుళ్లు, సంప్రదాయ వాద్యాల నడుమ భక్తులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ పీరీలను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా దర్గా ప్రాంగణంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, సుఖసంతోషాలు కలగాలని ప్రార్థించారు.ఉత్సవాల్లో హిందూ, ముస్లిం మతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారు.కార్యక్రమంలో మహమ్మద్ నజీర్ పాషా, రమేష్ బాబు,మస్తాన్,గౌస్, ఇమ్రాన్, అశోక్ బాబు, మహమ్మద్ అలీ, రవీందర్, యాకూబ్, యాకన్న, నయీమ్ పాషా పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *