జిల్లా విద్యాశాఖ అధికారి ఏ సత్యనారాయణమూర్తి
మహా తెలంగాణ / మహబూబాబాద్ :
రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల (కేజీబీవీ) విద్యార్థినులు ఐఐటి _ జేఈఈ, నీట్, క్లాట్ వంటి ఉన్నత స్థాయి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందించే యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలలో ఆరవ తరగతికి ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి, తెలిపారు. జిల్లాలో మహబూబాబాద్ గూడూరు, బయ్యారం కేజీబీవీలో మూడు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు , ప్రతి కేంద్రంలో 20 సీట్లు చొప్పున మొత్తం 60 సీట్లకు ఈ పోటీ జరుగుతుందని ప్రవేశ పరీక్ష రాసేందుకు 213 అప్లికేషన్స్ వచ్చాయని తెలిపారు. ఈ పరీక్ష ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 1:00 గంట వరకు నిర్వహించనున్నారని, ఇందులో ఎంపికైన విద్యార్థులకు 12వ తరగతి వరకు ఉచిత విద్య వసతితో పాటు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ఐఐటి – జేఈఈ – నీట్, క్లాట్ కోచింగ్ కొరకు ప్రత్యేక స్టడీ మెటీరియల్, అదనపు తరగతులు, మెరిట్ విద్యార్థులకు సమ్మర్ కోచింగ్, పోటీ పరీక్ష ఫీజులకు ఆర్థిక సాయం, 24 గంటల పర్యవేక్షణ, ఆరోగ్య సంరక్షణ,క్రీడలు, యోగ,సైకలాజికల్ కౌన్సిలింగ్, కంప్యూటర్ ల్యాబ్, హై స్పీడ్ ఇంటర్నెట్, లైబ్రరీ,ఈ లెర్నింగ్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు . ఈ పరీక్షలను geco వై.గాయత్రి. మరియు acge మందుల శ్రీరాములు పర్యవేక్షిస్తారని తెలిపారు