జిల్లాలో కేజీబీవీ లను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
జిఈసిఓ యాద్దనపూడి గాయత్రి
మహా తెలంగాణ/గంగారం:
విద్యార్థులు అకాడమిక్ విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని పాఠ్యాంశాలోని విషయాలను దైనందిన జీవితంలో వినియోగించాలని జిఈసిఓ యాద్దనపూడి గాయత్రి అన్నారు. జిల్లాలోని కేజీబీవీ గంగారం పాఠశాలను మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ పాఠశాలలో వార్షిక ప్రణాళికలు, పీరియడ్, ప్రణాళికలు బేస్ లైన్ టెస్ట్ లు, ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు సమయానికి విద్యార్థులకు పూర్తిచేసి రికార్డు నిర్వహిస్తూ, తిరిగి విద్యార్థులకు తెలియజేసి వారు ఏ అంశాలలో వెనుకబడి ఉన్నారో వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. పాఠశాలలోని ఆరవ తరగతి విద్యార్థులకు చెలిమి కార్యక్రమ అమలు ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా మరియు ఇతర కార్యక్రమాలను రోజువారీగా అప్డేట్ చేస్తూ ఉండాలని ఐఎఫ్ బి ప్యానల్స్ ను వినియోగిస్తూ ఎఫెక్టివ్ విద్యను విద్యార్థులకు బోధించాలని ఆమె సూచించారు. ఎంఈఓ విష్ణువర్ధన్ రావు మాట్లాడుతూ విద్యార్థులు పలు సబ్జెక్టులలో మంచి ఫలితాలను అందిస్తున్నారని ఇంకా ఐఎఫ్ బి ప్యానల్ ని ఉపయోగించి ప్రత్యక్ష పద్ధతిలో విద్యార్థులకు విషయాలను వివరించాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు అందించారు. వర్షాకాలంలో హాస్టల్ వాతావరణం పరిశుభ్రంగా ఉండాలని వేడి వేడి ఆహార పదార్థాలను మాత్రమే విద్యార్థులకు అందించాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో పాఠశాల ఎస్ఓ సుజాత, సిఆర్టి లు, పిజిసిఆర్టి లు పాల్గొన్నారు.