మహా తెలంగాణ,మరిపెడ,ఆగస్టు13:
మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామ శివారులోని రైస్‌మిల్లుకు వెళ్లే రోడ్డు వద్ద మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ కొరవి వైపు కారులో ప్రయాణిస్తున్న క్రమంలో గురువారం తృటిలో ప్రమాదం తప్పింది.స్థానికుల కథనం ప్రకారం..ముందుగా వెళ్తున్న ఓ ద్విచక్రవాహనం అకస్మాత్తుగా యూటర్న్ తీసుకోవడంతో, ఎదురుగా వస్తున్న కూలీలను తప్పించేందుకు మాజీ ఎమ్మెల్యే కారు డ్రైవర్ వాహనాన్ని నెమ్మదిగా నడిపారు.ఇదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న మరో కారు మాజీ ఎమ్మెల్యే కారు వెనుక భాగాన్ని ఢీకొట్టింది.దీంతో కారు వెనుక భాగం దెబ్బతింది.ప్రమాద సమాచారం తెలుసుకున్న అబ్బాయిపాలెం, ధారావత్ తండా గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌ను పరామర్శించారు.ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.