కంబాలపెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. రవిరాథోడ్

మహబూబాబాద్, సెప్టెంబర్.01

‘ఆశ డే ‘కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. రవిరాథోడ్ కంబాలపెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ నిర్వహించారు.

ఈ సందర్బంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం లో హాజరు రికార్డలను పరిశీలించి మరియు ఆశ ల రికార్డలను పరిశీలించి గర్భిణీ స్త్రీ ల నమోదు, ప్రమాదకార గర్భిణీ స్త్రీ ల ను గుర్తించి వారిని డాక్టర్ పర్యవేక్షణలో ఆరోగ్య సేవలు అందిచలని,0-5సంవత్సరాల వారికి వ్యాధి నిరోధక టీకాలు అందరికి అందె టట్లు చూడాలని,14-15 సంవత్సరాలవారికీ HPV వ్యాధి నిరోధక టీకా వలన స్త్రీలకు రాబోయే క్యాన్సరు లను నిరోధకముగా పనిచేస్తుందని అశలకు అవగాహన కల్పించి, కాలనుగుణముగా వచ్చే వ్యాధులలో జ్వరంలను ఇండ్ల సర్వే చేసి, చికిత్స అందించాలి. లార్వా ల ను తొలగించడం మరియు దోమలు నివారణ చర్యలు అనగా అంబెట్ స్ప్రే గ్రామ పంచాయతీ సమన్వయము తో పరిశుభ్రం పాటించాలని అవగాహనా కార్యక్రమం లు ఏర్పాటు చేయాలని తెలియజేస్తూ, జాతీయ ఆరోగ్య కార్యక్రమం లపై సమీక్షించి,లక్ష్యాలు సకాలంలో సాదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారులు డాక్టర్ వీరజిత, డాక్టర్. శివకుమార్, పీహెచ్ సి డాక్టర్. సుధీర్ మరియు వైద్య సిబ్బంది, ఆశలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *