మహాతెలంగాణ/మహబూబాబాద్:
జనసేన పార్టీ అధినేత ఎపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్బంగా బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో జనసేన పార్టీ పార్లమెంట్ కో ఆర్డినేటర్ దాసరి రావిష్ మరియు జిల్లా నాయకులు మెరుగు చక్రపాణి ఆధ్వర్యంలో లక్ష్మి థియేటర్ లో పంజా సినిమా రీ రిలీజ్ అయిన సందర్బంగా అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు, అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు మేకల గోపాల్, తగరం వివేక్, అమీర్, దుర్గ ప్రసాద్, ఎస్ కె పాష, బంటు వీరన్న తదితరులు పాల్గొన్నారు.