కాళోజి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వనమహోత్సవం

మహాతెలంగాణ/మహబూబాబాద్:

కాళోజి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశమునకు అసోసియేషన్ అధ్యక్షులు నామిరెడ్డి వెంకట్ రెడ్డి గారు అధ్యక్షత వహించగా…. ముఖ్య అతిథిగా హాజరైన మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ గౌరవనీయులు శ్రీ ఎం వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ….. మహబూబాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియం కేంద్రంగా చేసుకొని ఏర్పాటు చేసిన కాళోజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించడం చాలా అభినందనీయమని, దాతల సహకారంతో సుమారుగా 100 మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతలు చూసుకోవడం వలన భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందని అన్నారు. భూమిపై 33% ఉండాల్సిన అడవులు రోజురోజుకు జరిగిపోవడం వలన ప్రకృతిలో అనేక విలయాలు సంభవిస్తున్నాయని,అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడడం వలన హిమానీనదాలు కరిగిపోవడం తద్వారా జలప్రళయాలు ఏర్పడుతున్నావని, దానికి ఉదాహరణ నేపాల్ దేశంలో జరిగిన వరదల వలన కలిగిన ఇబ్బందులను చూడవచ్చన్నారు. అందువలన భూమిపై అవకాశం ఉన్న ప్రతి చోట (ఇంటిలో, బయట) ప్రతి ఒక్కరు మొక్కలు నాటి, వాటిని బ్రతికించుకోవాలని అన్నారు. ఆత్మీయ అతిథులుగా పాల్గొన్న స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ శ్రీ కాటా భాస్కర్ గారు మాట్లాడుతూ…. ఈమధ్య కాలంలో ఎల్ నినో వలన కరువులు ఏర్పడడానికి అడవులు లేకపోవడమే కారణమని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడానికి కృషి చేయాలని అన్నారు. ఈరోజు నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమానికి సుమారుగా 100 మొక్కలను అందించిన గుండంరాజు పల్లి సర్పంచ్ శ్రీ గునిగంటి కమలాకర్ గారు మాట్లాడుతూ…… ఈ స్టేడియం లో వాకింగ్ చేయడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఇక్కడ అన్ని వయసులవారు చాలా ఆనందంగా వాకింగ్ చేయవచ్చని అన్నారు. ఇక్కడ మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళము అవుతామని అన్నారు. కాళోజీ వాకర్స్ అసోసియేషన్ పర్యావరణ పరిరక్షణ ద్యేయంగా పనిచేస్తుందని అన్నారు. మహబూబాబాద్ ఎంపీడీవో రఘుపతి రెడ్డి గారు మాట్లాడుతూ ఈ స్టేడియంలో ఇంకను అదనంగా మొక్కలు నాటాలని భావిస్తే, వాటిని అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఇంకనూ ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సలహాదారులు మైసా శ్రీనివాస్, కార్యదర్శి పట్టాభి లక్ష్మయ్య, కోశాధికారి సోమ విష్ణువర్ధన్,పెద్ది వెంకన్న, సునీత దేవి, శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెస్ రెడ్డి, మహేందర్ రెడ్డి, రవీందర్, మధుకర్, మల్లారెడ్డి,ప్రసాద్, రాంబాబు, వెంకటేశ్వర్లు,తొలేం వెంకటేశ్వర్లు, ఎస్ శ్రీనివాస్ రెడ్డి, విద్యాసాగర్, వెంకట్, రవి, సోమ రవి, జగదీష్, రమేష్, కృష్ణమూర్తి, దామోదర్, భరత్, కృష్ణమోహన్, రాధాకృష్ణ, పగడయ్య, దామోదర్ రెడ్డి, నరేష్ రెడ్డి, బూర్ల ప్రభాకర్, ఐలేష్, నాగరాజు, బందెల రాజు, శ్రీనివాస్, నేరెళ్ల రాజు, రవి కుమార్, మధు, డాక్టర్ సాయి కిరణ్, మహిళలు పిల్లలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *