13వ వార్డు కౌన్సిలర్ కాటా భాస్కర్
మహాతెలంగాణ/మహబూబాబాద్:
విద్యార్థులు క్రీడల్లో రాణించి భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని మహబూబాబాద్ మునిసిపల్ 13వ వార్డు కౌన్సిలర్ కాటా భాస్కర్ సూచించారు. శుక్రవారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం లో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సెలక్షన్లు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ గుర్తింపు పొందిన సాఫ్ట్ బాల్ క్రీడలో విద్యార్థులు రాణించి ప్రభుత్వం కల్పించే స్పోర్ట్స్ కోట 2శాతం రిజర్వేషన్ సద్వినియోగపరుచుకోవాలని క్రీడల్లో రాణించి మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని ఆయన అన్నారు. తాను బాల్ బ్యాట్మెంటన్ క్రీడాకారుడినేనని క్రీడలకు గురించి తనకు అవగాహన ఉందని, చదువులో పాటు విద్యార్థులు క్రీడల్లో పాల్గొంటూ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆయన అన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించేలా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పుప్పాల సంజీవరావు, సెక్రటరీ సమ్మెట ప్రేమ్ కుమార్, బేస్బాల్ అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ కల్లూరి ప్రభాకర్, అసోసియేషన్ బాధ్యతలు ఆవారి శ్రీనివాస్, డైరెక్టర్ పిల్లి కాశీనాథ్, ఉపాధ్యాయులు లలిత, ప్రణయ్, సునీల్, కళ్యాణి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.