మహబూబాబాద్ జిల్లా చైర్మన్,కన్వీనర్ వడ్డేబోయిన శ్రీనివాస్,మహమూద్ రఫీ లు పిలుపు
మహాతెలంగాణ/మహబూబాబాద్:
రాష్ట్ర ప్రభుత్వఉద్యోగు ల,ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధనకై సెప్టెంబర్ 10న టీజీజాక్ తలపెట్టిన ఛలో హైదరాబాద్ ను జయ ప్రదం చేయాలని కోరుతు నేతలు పోస్టర్ ను ఆవిష్కరించారు.తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి జిల్లా నుండి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారుఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే పలు దశల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సి పి ఎస్ రద్దు చేసి ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా వెంటనే ఓపిఎస్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు పీఆర్సీ , పెండింగ్ డీఏల చెల్లింపు, ఉద్యోగుల పెండింగ్ బిల్లుల పరిష్కారం, ఆరోగ్య పథకం అమలు, తదితర సమస్యలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో జాప్యం చేస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు “ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమిద్దాం.. సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లో కదం తొక్కుదాం” అని వారు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో నాయకులు మురళీకృష్ణ ఫిరోజ్ రమేష్ ప్రసాద్ హాలియా నాయక్ భాస్కర్ గోపికృష్ణ సత్యనారాయణ భద్ర నాయక్ రోహిత్ నాగమణి విష్ణువర్ధన్ రెడ్డి హరినాయక్ దేవేందర్ రాజు లక్ష్మీకాంత్ ఉపేందర్ మంజుల రోహిత్ రాజశేఖర్ బిక్షపతితదితరులు పాల్గొన్నారు