మహాతెలంగాణ/మరిపెడ:
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు,స్పీకర్ తల్లి గారిని ఘోరంగా అవమానించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్సీ తాతా మధు దిష్టి బొమ్మతో శవయాత్ర నిర్వహించారు.అనంతరం మరిపెడ ప్రభుత్వ అది గృహం ముందు ఎమ్మెల్సీ తాత మధు దిష్టిబొమ్మను దహనం చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు అడ్డు కొని దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకున్నారు.అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకుల అహంకార ధోరణితో ఏకంగా శాసనసభ స్పీకర్,దళిత నాయకుడు గడ్డం ప్రసాద్ కుమార్ ను ఇష్టం వచ్చినట్టు దూషించి,వారి తల్లి గారిని అవమానించడం,పోలీస్ అధికారుల పైన దాడి చేయడం సరైంది కాదని వెంటనే ఎమ్మెల్సీ తాత మధు మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని,ఎస్సీఎస్టీ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక,పదేళ్లు అధికారంతో రాష్ట్రాన్ని దోచుకొని,అధికారం లేకపోవడంతో జీర్ణించుకోలేక సైకోలుగా మారి,కెసిఆర్ ప్రోత్సహంతోటి పామ్ హౌస్ లో జరిగిన ప్రణాళికలో భాగంగా బిఆర్ఎస్ గుండాలు అసెంబ్లీ ప్రాంగణం వద్ద ప్రోటోకాల్ ఉల్లంఘించి ప్రభుత్వ వ్యతిరేక స్లోగన్లు ఉన్నటువంటి నల్ల టి షర్ట్లు ధరించి సభలో ప్రవేశించడానికి యత్నించడం సమంజసమేనా అని ప్రశ్నించారు.అడ్డుకోబోయిన పోలీసులపై దాడి చేయడం,హరీష్ రావు మహిళా అధికారుల ముందే టీ షర్టు తీసి వేసి అర్ధ నగ్న ప్రదర్శన చేయడం ఏంటని,స్వయంగా కేటీఆర్,హరీష్ రావు పోలీసుల పైన ప్రత్యక్ష దాడికి దిగడం అమానుషమని,వారి పైన వ్యూహరచన చేసిన కేసీఆర్ పైన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారి శాసనసభల సభ్యత్వాన్ని రద్దుచేసి భర్తరఫ్ చేయాలని,లేనట్లయితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తీవ్ర ఆందోళనలు చేపడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు యుగేందర్ రెడ్డి,నియోజకవర్గ ఇన్చార్జ్ అవేజ్,పట్టణ అధ్యక్షులు రామ్ లాల్,వైస్ చైర్మన్ సునీత రవీందర్ రెడ్డి,తాజుద్దీన్,అయిలమల్లు,అంబరీష,విజయ్,మున్సిపాలిటీ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు,నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.