విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి

మహబూబాబాద్ సి ఐ అంజలి

మహాతెలంగాణ/మహబూబాబాద్:

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోను రాణించాలని మహబూబాబాద్ సిఐ అంజలి, సూచించారు. గురువారం మహబూబాబాద్ మండలం కంబాలపల్లి జడ్పీహెచ్ఎస్ లో జరిగిన ఎస్ జి ఎఫ్ జోనల్ స్థాయి క్రీడల ప్రారంభోత్సవ సభలో సి ఐ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూవిద్యార్థులు తమకు నచ్చిన క్రీడను ఎంచుకుని ఆయా రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆమె ఆకాక్షించారు. క్రీడల్లో పాల్గొనడంవల్ల వివిధ పాఠశాలల నుంచి వచ్చే క్రీడాకారులతో స్నేహ సంబంధాలు పెరుగుతాయని, క్రమశిక్షణ అలవడుతుందని ఆమె అన్నారు. అలాగే క్రీడల్లో పాల్గొన్నవారు ప్రతి ఒక్కరూ, దేహదారుడ్యంతో ఆరోగ్యవంతులుగా తయారవుతారని, ఉన్నత స్థాయికి ఎదిగిన జాతీయ క్రీడాకారులకు ప్రభుత్వం కూడా మంచి అవకాశాలు కల్పిస్తోందని సీఐ తెలిపారు. పాఠశాల హెచ్ఎం కుంజార గిరిజ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమం లో సర్పంచ్ వసంత ఉపేందర్ రెడ్డి, ఇంచార్జి డి ఈ ఓ మందుల శ్రీరాములు, ఎస్ జి ఎఫ్ సెక్రటరీ వాసిరెడ్డి ప్రవీన్ రెడ్డి, కటకం యాకన్న, వికాస్ విద్యా సంస్థల చైర్మన్ బిక్కి వెంకటేశర్లు మహంకాలి వెంకటేశ్వర్లు, అవారి శ్రీనివాస్, చాంప్లా నాయక్ , రామాసహాయం శ్రీధర్ రెడ్డి, కే ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.

r

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *