జిల్లాలో సాగునీరు సాధనకై సమరం సాగిస్తాం

కోతుల బెడుద నివారించాలి

రైతు సంఘం జిల్లా మహాసభలో పలు తీర్మానాలు.

నూతన కమిటీ ఎన్నిక

మహా తెలంగాణ/మహబూబాబాద్

రాబోయే కాలంలో సాగునీరు, పోడు భూములకు పట్టాలు, కౌవులు రైతుల సమస్యలపై సమరశీల పోరాటాలకు రైతాంగాన్ని సిద్ధం చేస్తామని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుణగంటి రాజన్న శెట్టి వెంకన్నలు వెల్లడించారు.

శనివారం నాడు సారంపల్లి మల్లారెడ్డి నగర్ లో జరిగిన తెలంగాణ రైతు సంఘం జిల్లా మహాసభల సందర్భంగా ఆమోదించిన తీర్మానాలను ఆదివారం విలేకరుల సమావేశంలో జిల్లా కోశాధికారి ఆకుల రాజు తో కలిసి వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో రైతులు బావులు, బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని, శ్రీరాంసాగర్ కాలువలు అయిన వెన్నవరం కాలువ ఉన్నప్పటికీ నీరు రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కాలువలకు నీళ్లు రావాలంటే సమ్మక్క సాగర్ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండవ దశ పూర్తయితే మహ బాద్ జిల్లాలో 96,494 ఎకరాలకు సాగునీరు అందివ్వడమే కాకుండా, పాత కాలువలకు నీరు కూడా అందుతుందని తెలిపారు. గతంలో వేన్నవరం కాలువ నిర్మాణం విషయంలో రైతు సంఘం పోరాటాల వల్లే సాధించామని అదేవిధంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రెండవ దశ నిర్మాణం చేపట్టి జిల్లాకు సాగునీరు అందించే వరకు పోరాటాలను ఉదృతం చేయనున్నట్లు వారు తెలిపారు.
జిల్లాలో పోడు రైతులు 9 మండలాల్లో సుమారు 70000 ఎకరాల్లో సాగు చేసుకుంటున్నారని కానీ కేవలం 25 వేల గిరిజన రైతులకు మాత్రమే హక్కు పత్రాలు ఇచ్చారని మరో 35 వేల మందికి అర్హులైన వారికి పట్టాలు ఇవ్వలేదని దానితో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని కోరుతామని తెలిపారు.
జిల్లాలో పెద్ద ఎత్తున ఉన్న కౌలు రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, బ్యాంకు రుణాలు ఇవ్వాలని అలాగే ప్రభుత్వ రాయితీలు, పథకాలు వారికి అందివ్వడం కోసం కౌలుదారి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ పోరాడుతామని తెలిపారు.
జిల్లాలో కోతుల బెడద విపరీతంగా ఉందని, రాబోయే కాలంలో వీటివల్ల రైతులు వ్యవసాయానికి దూరం అవుతున్నారు, వాటి నివారణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
రైతు పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరల కోసం నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కోసం రైతు సంఘం పోరాటాల నిర్వహిస్తుందని తెలిపారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులను సమీకరించి పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. రైతులకు ఇబ్బంది కలిగించే యూరియా, పత్తి యాప్లను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తామని తెలిపారు. కార్పొరేట్లకు లాభం చేస్తూ రైతులకు నష్టం కలిగించే విత్తన చట్టం, విద్యుత్ సవరణ చట్టం, ఎరువుల విధానం, నీటి విధానం, పంటల బీమా చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.
నూతన జిల్లా కమిటీ
తెలంగాణ రైతు సంఘం మహబూబాబాద్ జిల్లా నూతన కమిటీని రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన అధ్యక్షులుగా గుణగంటి రాజన్న, కార్యదర్శిగా శెట్టి వెంకన్న, కోశాధికారిగా ఆకుల రాజు, ఉపాధ్యక్షులుగా నంబూరి మధు, బొబ్బల యాకూబ్ రెడ్డి, బొబ్బ వెంకటరెడ్డి, కర్రే శ్రీనివాస్ రెడ్డి, సహాయ కార్యదర్శిలుగా నల్లపు సుధాకర్, గడ్డిపాటి రాజారావు, మారుతినేని పాపారావు, బొల్లం అశోక్, కందాల రమేష్ లు ఉన్నారు. మరోపద్ 18 మందితో జిల్లా కమిటీని ఎన్నుకున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *