హెచ్ ఎం హీరాలాల్
మహాతెలంగాణ/మరిపెడ:
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని రాంపురం గ్రామానికి చెందిన రాంపల్లి యాకయ్య, సూర్యల దాతృత్వం అభినందనీయమని రాంపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు హీరాలాల్ అన్నారు.మరిపెడ మండలంలోని రాంపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదివే ఒకటి నుండి 5వ తరగతి పిల్లలు 75 మంది విద్యార్థిని విద్యార్థులకు గ్రామానికి చెందిన రాంపల్లి సూర్య,సాయి,భవాని లు వారి తండ్రి యాకయ్య పిల్లలందరికీ ఉచితంగా5000 విలువచేసే టై,బెల్ట్,బ్యాడ్జి అందించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాంపురం ప్రాథమిక పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని ప్రభుత్వ పాఠశాలలోనే ఉన్నత విద్యార్హతలు కలిగి నైపుణ్యాలు నేర్పేటువంటి ఉపాధ్యాయులు ఉంటారని ఈ పాఠశాల యొక్క బలోపేతానికి ఉడత భక్తిగా తమ వంతు సహాయము చేశామని అలాగే రాబోయే కాలంలో కూడా తప్పకుండా పిల్లల మరియు పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతామని అన్నారు.ఈ సందర్భంగా వారిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అభినందించారు.ఈ కార్యక్రమంలో మూడవ వార్డు సభ్యులు బోర సతీష్,ఉపాధ్యాయులు గుర్రం వెంకన్న,రాజేశ్వరి,శ్రీధర్ గణేష్,క్రాంతి,తల్లిదండ్రులు బందు పరశురాములు గుండ గాని బాబు చింత మమత,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.