ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్న ఆనకట్టను పునర్నిర్మించాలి

మహాతెలంగాణ/మరిపెడ:

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉమ్మడి తానంచర్ల గ్రామపంచాయతీ పరిధిలోని అజ్మీర తండా ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్న ఆనకట్టను పునర్నిర్మించాలని వ్యవసాయం కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బాణాల రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మరిపెడ మండల కేంద్రంలోని సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఎమ్మార్వో ఎంపీడీవో లను కలిసి పలు ముఖ్యమైన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.తక్షణమే ఈ ఆనకట్ల పై పూర్తి విచారణ జరిపించి ఇరిగేషన్ అధికారులు కలగజేసుకొని,ఆనకట్టను పున నిర్మించాలని,లేనిపక్షంలో ఈ ప్రాంత రైతులని మొత్తం సమయుక్తపరిచి దశలవారీగా ఉద్యమం నిర్మించి సమస్య పరిష్కారం అయ్యేవరకు పోరాడుతామని ప్రభుత్వాన్ని మరో మారు హెచ్చరించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *