మహబూబాబాద్ లో జిల్లాలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. మోడీ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి

PDSU, SFI, AISF, PDSU,NSUI సంఘాల డిమాండ్

మహా తెలంగాణ/మహబూబాబాద్ :

ఢిల్లీలో జంతర్,మంతర్ వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులను పోలీసుల తో కొట్టించి ఒక విద్యార్థిని మరణానికి కారణమైన పోలీస్ ఉన్నత అధికారులను శిక్షించాలని పి డి యస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పాట్ల మధు, పి డి యస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బోనగిరి మధు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వెలుగు శ్రవణ్,ఎన్ ఎస్ యు ఐ మాజీ జిల్లా అధ్యక్షులు పెరుమాండ్ల చరణ్ గౌడ్, VJS రాష్ట్ర నాయకులు ఇరుగు మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపులో భాగంగా మహబూబాబాద్ లో మెడికల్ కాలేజ్ ,జేఎన్టీయూ, ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలను విద్యార్థి సంఘాలు సంపూర్ణంగా బంద్ చేయించారు. మెడికల్ కళాశాల విద్యార్థులతో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో నీటి పరీక్షలు రాస్తున్న లక్షలాదిమంది విద్యార్థులను మోసం చేసిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, వందలాదిమంది విద్యార్థులపై లాఠీలు జులిపించి రక్తపాతం సృష్టించడానికి కారణమైన నరేంద్ర మోడీ బేషరతుగా విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోని విద్యార్థులు విద్యారంగ సంక్షోభానికి వ్యతిరేకంగా, నీట్ పరీక్ష పేపర్ లీకుల కు వ్యతిరేకంగా పోరాడుతుంటే విద్యార్థి ప్రతినిధులతో చర్చలు జరపకుండా మొండిగా వ్యవహరించడమే కాకుండా ఆందోళనకారులలో దేశద్రోహులు చొరబడ్డారని అబండాలు వేసి విద్యార్థి ఉద్యమాన్ని బలహీనపరచడం కోసం బోగస్ ఉద్యమాలు అంటూ నీచంగా మాట్లాడుతున్నారని అన్నారు. మూడు దశాబ్దాల క్రితం ధర్మేంద్ర ప్రధాన్ పరీక్ష పేపర్ లీకులకు వ్యతిరేకంగా సచివాలయం ముందు ఆందోళన చేసి పరీక్ష పేపర్ లీకులకు కారణమైన వారిని రాజీనామా చేయాలని ఆనాడు నినదించిన వ్యక్తి ఈనాడు ఆయనేందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా దేశ విద్యారంగాన్ని కాపాడడం కోసం బీజేపీ ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పి డి యస్ యూ మహబూబాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నందీశ్వర్, గౌతమ్, ప్రవీణ్ ఐక్య విద్యార్థి సంఘాల జిల్లా నాయకులు వెంకటేష్, సాయికుమార్,బల్లం చంటి,సతీష్ నాయక్, ఇషన్, చరణ్, చేతను, రాజు, శ్రవణ్, అభి,దూది కట్ల వంశీ, నవీన్, జస్వంత్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *