రైతాంగ సమస్యల ఆగస్టు 10న జైల్ బరో జయప్రదం చేయండి: రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టి వెంకన్న పిలుపు

మహబూబాబాద్

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు 10న జరిగే జైల్ బరో వేలాది మంది రైతులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టి వెంకన్న పిలుపునిచ్చారు.
శనివారం స్థానిక పెరుమాళ్ల జగన్నాథం భవన్లో జరిగిన రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశానికి గుణగంటి రాజన్న అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వెంకన్న మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక ప్రభుత్వ0 అని అన్నారు .గతంలో రైతులను వ్యవసాయం నుండి దూరం చేయడం కోసం మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకుని వచ్చిందని, దానికి వ్యతిరేకంగా సంవత్సర కాలం పాటు రైతులు పోరాటం చేసిన ఫలితంగా మోడీ ప్రభుత్వం వాటిని తాత్కాలికంగా నిలిపివేసిందని అన్నారు. తిరిగి వాటిని దొడ్డిదోవన ప్రవేశ పెట్టడం కోసం కుట్రలు పన్నుతోందని అన్నారు. అందులో భాగంగానే నూతన విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొని వస్తుందని దీనివలన రైతులు విద్యుత్కు దూరమయ్యే ప్రమాదం ఉందని కరెంటును ఉత్పత్తి చేసిన ధరకే కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు, వ్యవసాయానికి ఉపయోగించే ఎరువులు పురుగు మందులు వ్యవసాయ పరికరాలపై సబ్సిడీలు పూర్తిగా రద్దు రద్దు పరుచుటకు కార్పొరేట్ కంపెనీలతో కుమ్ముక్కుఅవు ఉన్నారని తెలిపారు. దీనికి వ్యతిరేకంగా రైతాంగాన్ని, కూలీలని, కార్మికులను కూడగట్టి ఆగస్టు 10న జైలు భరో ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానం పరిపూర్తి చేయలేదని రైతులకు రుణమాఫీ రైతు భరోసా కౌలు రైతులకు సంవత్సరానికి ₹12,000 వ్యవసాయ కార్మికులకు 12000 కూలి బందు రైతుల బీమా మాట తప్పారని విమర్శించారు. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతులను కూడా పెట్టి పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఆగస్టు పదిన జరిగే జైలు భరో ఉద్యమానికి రైతాంగం పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు ఆకుల రాజు, జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా సహాయ కార్యదర్శులు గడ్డిపాటి రాజారావు, సుధాకర్. నంబూరి మధు, దారావత్ బుజ్జి. జక్కుల మల్లయ్య, బొబ్బల యాకూబురెడ్డి, కందాల రమేష్, జిల్లా కమిటీ సభ్యులు మల్లేటి కోటయ్య, బానోత్ సర్వన్, కొత్త వెంకటరెడ్డి, జిన్నపరెడ్డి సోమిరెడ్డి, మంకిన తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *