నర్సరీదారులకు నర్సరీ చట్టం యొక్క నియమ నిబంధనలపై అవగాహన సదస్సు

మహబూబాబాద్ రైతు వేదిక మిరప, కూరగాయల నర్సరీదారులకు జిల్లా ఉద్యాన & పట్టు పరిశ్రమ శాఖ, జిల్లా వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. నర్సరీదారులు నియమ నిబంధనల ప్రకారం నర్సరీలను నిర్వహించాలని సూచించారు.

 నర్సరీలలో పలు మేలైన యాజమాన్య పద్దతులు, సూచనలు, మరియు నర్సరీ నియమ నిబంధనలు పాటించాలి.
 రైతుల అంగీకారం తెలిపిన రకాలను, పేరు గాంచిన రకాలను, వ్యవసాయ శాఖ ద్వారా ఆమోదం పొందిన రకాల నారును పెంచాలి.
 నర్సరీ చట్టం ప్రకారం నియమ నిబంధనలు పాటించాలి.
 ఆరుబయట (ఓపెన్ ఫీల్డ్స్ లో) నారును పెంచవద్దు. .
 నర్సరీ లైసెన్స్ లేకుండా నర్సరీ నుండి మిరప, కూరగాయలు మొదలైన నారు అమ్మవద్దు, కొనవద్దు.
 నర్సరీ నియమ నిబంధనలు పాటించని వారి పై నకిలీ విత్తనాలు, నారు పోసిన వారి పై PD Act పెట్టి జైలుకు పంపబడును, జరిమానా కూడా విధించబడును. ప్రతి రైతు పొలం గట్ల మీద, పొలం చుట్టూ, పెరట్లో, ఆయిల్ పామ్, పండ్ల తోటలలో అంతర పంటలుగా, డాబాల మీద, ఇంటి ముంగిట రోజువారి అవసరాల నిమిత్తం అన్ని రకాల కూరగాయలను సాగు చేసుకోవాలి. కూరగాయల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, నూతన రకాల సాగు, ప్రోట్రేస్లలో నారు పెంపకం, ఎత్తు మడులు, మల్చింగ్, బిందు సేద్యం, ఫర్టిగేషన్, వేప పిండి, ఆముదం పిండి వాడకం, వేప నూనె పిచికారి చేయటం, పసుపు రంగు అట్టల వాడకం, సిఫారసు చేసిన ఎరువులు వాడటం, పందిరిపై కూరగాయల సాగు, ట్రెల్లిస్ మెథడ్ లో టమాటా సాగు మొదలైన పద్ధతులు పాటించాలి. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన & పట్టు పరిశ్రమ అధికారి జినుగు మరియన్న, ఇంచార్జి జిల్లా వ్యవసాయ అధికారి ఏ. శ్రీనివాస్, , ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. బి. క్రాంతి కుమార్, కే.వి.కె. మల్యాల, డా. కె. నాగరాజు, హెడ్ సైంటిస్ట్, ఉద్యాన పరిశోధన కేంద్రం, మల్యాల, ఎన్. తిరుపతి రెడ్డి, మండల వ్యవసాయ అధికారి, ఉద్యాన అధికారులు ఎ. జె. శాంతిప్రియదర్శిని, ఆర్.శాంతి ప్రియ, బి.మానస, కార్యాలయ సూపరింటెండెంట్ ఆర్. శ్రీనివాస రావు, వ్యవసాయ విస్తరణ అధికారులు సాయి ప్రకాష్, పున్నమి, నర్సరీదారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *