ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి – పోరిక బలరాం నాయక్ (మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు)

వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున, ఎవరూ వాటిని దాటే ప్రయత్నం చేయవద్దు. అలాగే, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను.

శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారు ఎవరైనా ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేసి, నిరంతరం పర్యవేక్షణ జరిపేలా ఆదేశాలు జారీ చేశారు.

మహబూబాబాద్ పార్లమెంట్ లో వాగులు అధికంగా ఉన్నందున, ప్రజలను అప్రమత్తం చేసేందుకు కలెక్టర్లు, జిల్లా అధికారులందరితో మాట్లాడి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరాము.

అధికారులతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రజలకు అవగాహన కల్పించి, వారు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *