బాస్కెట్ బాల్ టోర్నమెంట్ లో డాక్టర్ బండి మురళీధర్ రెడ్డి
మహాతెలంగాణ/ మహబూబాబాద్:
క్రీడలు ఆరోగ్యాన్ని ఇస్తాయని, విద్యార్థులు యువకులు కొంత సమయాన్ని క్రీడలకు కేటాయించి ఆరోగ్యవంతులుగా తయారు కావాలని మహబూబాబాద్ ప్రముఖ వైద్యులు డాక్టర్ బండి మురళీధర్ రెడ్డి అన్నారు. సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్, ఎంబీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాస్కెట్బాల్ పోటీలకు ముఖ్య అతిథిగా ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ ముల్లంగి ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా బాస్కెట్బాల్ క్రీడకు పుట్టినిల్లని బాస్కెట్బాల్ క్రీడలో జాతీయ స్థాయిలో రాణించాలని ఆయన అన్నారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కేసముద్రం మాజీ మార్కెట్ చైర్మన్ మాధవపెద్ది శశి వర్ధన్ రెడ్డి, చీకటి చంద్రయ్య, ఎంబీఏ అధ్యక్షులు మొగలి ప్రసాద్ రెడ్డి, బేస్ బాల్అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ కల్లూరి ప్రభాకర్, వెంకట్రామ నర్సయ్య, కోచ్ వెలిశాల కుమారస్వామి, పద్మావతి, వడ్డెబోయిన శ్రీనివాస్, పెళ్లి కాశీనాథ్, సీనియర్ క్రీడాకారులు శ్రావణ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.