మహబూబాబాద్ :
మహబూబాబాద్ పట్టణంలోని బొడ్రాయి సెంటర్ లో గల వికాస్ ఇందిరా విద్యాసంస్థలలో కళాశాల చైర్ పర్సన్ ఇందిర, కళాశాల కరస్పాండెంట్ బిక్కి వెంకటేశ్వర్లు అధ్యక్షతన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో కళాశాల కరస్పాండెంట్ వికాస్ ఇందిర విద్యాలయాలలో జెండా ఎగురవేసి విద్యార్థిని విద్యార్థులకు చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఈ గణతంత్ర దినోత్సవం ఎందరో మహనీయుల త్యాగ ఫలితం అని వారి త్యాగం మూలంగా ఈరోజు మనం స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం అనే ఆయుధంతో మన మేధావుల కృషితో ప్రపంచంలోనే అత్యంత బలమైన రాజ్యాంగాన్ని తయారు చేసుకొని ప్రజాస్వామ్యబద్ధమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు వరకు ఎవరికీ తలవంచకుండా తలెత్తుకొని నిలబడేలా మన మహనీయులు చేశారని తెలియజేశారు. విద్యార్థిని విద్యార్థులు మీ యొక్క బాధ్యతను తెలుసుకొని మెలగాలని ఉత్తమ పౌరులుగా ఎదగాలని రానున్న పరీక్షలలో మంచి ఫలితాలు సాధించి మహబూబాబాద్ జిల్లాను ప్రథమ స్థానంలోకి తీసుకుపోవాలని తెలియజేశారు. అలాగే కళాశాలల చైర్పర్సన్ ఇందిరా మాట్లాడుతూ మన మహనీయుల కష్టార్జితమే ఈరోజు మనం అనుభవించే స్వేచ్ఛ స్వతంత్రాలు అని వాటిని దుర్వినియోగం చేసుకోకుండా కాపాడుకుంటూ మీ జీవితాలను బంగారు బాటగా ఏర్పాటు చేసుకోవాలని విద్యార్థిని విద్యార్థులకు సూచించారు. తదుపరి కళాశాల ప్రిన్సిపల్ జి వీరయ్య ఇందిర విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీముఖి ప్రసంగించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన ఆటల పోటీలలో విజేతలు అయిన విద్యార్థులకు కళాశాల చైర్మన్ మరియు కరస్పాండెంట్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు బి. నరేష్, ఏ. మధు, జే .వెంకటమల్లు, ఏ .సునీత, వి. నాగరాజు, మాధవి, లక్ష్మీ ప్రసన్న, పద్మావతి, రేవతి, సునీత, అంజలి,జి .బిక్షం, ఆర్ .సారంగం, తుప్పతూరి యాకన్న యాదవ్ పాల్గొన్నారు.