మహబూబాబాద్:
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – రైతువారంలో భాగంగా మంగళవారం మహబూబాబాద్ మరియు డోర్నకల్ నియోజకవర్గ స్థాయి పంట మార్పిడి ద్వారా ఉద్యాన పంటల సాగు, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపుదల, ప్రత్యామ్నాయ పంటల సాగు అవగాహన సదస్సును జిల్లా ఉద్యాన & పట్టు పరిశ్రమ శాఖ, TG OILFED, వ్యవసాయ శాఖ, సహకార శాఖ, మార్కెటింగ్ శాఖ, కృషి విజ్ఞాన కేంద్రం, ఉద్యాన పరిశోధన స్థానం, ఉద్యాన కళాశాల వారి సహకారంతో నిర్వహించటం జరుగుతుందని జిల్లా ఉద్యాన & పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న నేడు ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబాబాద్ నియోజకవర్గ స్థాయి సమావేశం గిరిజన భవన్, పాత కలెక్టర్ ఆఫీస్ రోడ్, మహబూబాబాద్ నందు మరియు డోర్నకల్ నియోజకవర్గ స్థాయి విజయ గార్డెన్స్, గొల్లచెర్ల X రోడ్ డోర్నకల్ మండలం నందు జరుగునని అన్నారు. కావున సమస్త గౌరవ సర్పంచులు, అభ్యుదయ రైతులు, వెజిటబుల్ వాలంటీర్స్, ఎఫ్.పి.ఓ.లు, ఔత్సాహిక రైతులు, అందరూ పాల్గొని పంట మార్పిడి చేసి ఆయిల్ పామ్, మల్బరీ సాగు ద్వారా ఎకరానికి లక్ష రూపాయలు పైగా ఆదాయం పొందాలని విజ్ఞప్తి చేశారు.