మహా తెలంగాణ/మరిపెడ
మహబూబాబాద్‌లో శనివారం నిర్వహించిన రాష్ట్ర ఉప సర్పంచ్‌ల సమావేశంలో నూతన రాష్ట్ర ఫోరం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఉప సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడిగా బొట్ల కార్తీక్ ఎన్నికయ్యారు.
అలాగే మరిపెడ మండలం గుండెపుడి గ్రామానికి చెందిన గడ్డం ఉపేందర్ రెడ్డి రాష్ట్ర ఉప సర్పంచ్‌ల ఫోరం ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చీకటి కరుణాకర్ బాధ్యతలు స్వీకరించారు.
ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఉపేందర్ రెడ్డిని సమావేశంలో పాల్గొన్న ఉప సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు అభినందించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారం, గ్రామాభివృద్ధిలో వారి పాత్రను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఉపేందర్ రెడ్డి తెలిపారు.
గుండెపుడి గ్రామానికి చెందిన వ్యక్తి రాష్ట్ర స్థాయి బాధ్యతలకు ఎంపిక కావడం మరిపెడ మండలానికి గర్వకారణమని స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు.