చైర్ పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి
పారిశుద్ధ్య పనుల పరిశీలన
మహా తెలంగాణ/మరిపెడ
మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనుల నిర్వాహనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు మరిపెడ మున్సిపాలిటీ చైర్పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి అన్నారు.సోమవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని కార్గిల్ సెంటర్ లో ప్రధాన డ్రైనేజీలో పూడికతీత పనులను,మెయిన్ రోడ్డు పైన సైడ్ డ్రైనేజి నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డితో కలసిపరిశీలించారు.ఈ సందర్భంగావారి వెంట కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అలువాల ఉపేందర్ ప్రజాపతి,వెంకట సాయి,సిబ్బందితదితరులు ఉన్నారు.