సీఎం వ్యాఖ్యలు అపేక్షనియం

టీపీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షులు బోడ రాంజీ నాయక్‌

మహాతెలంగాణ/మరిపెడ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో మూత బడ్డ పాఠశాలలను తెరిపిస్తామని హామీ ఇచ్చి,అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల గిరిజన తండాకో పాఠశాల అవసరం లేదని వ్యాఖ్యానించడం సరికాదని రాంజీ నాయక్ అన్నారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ,ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు 90 శాతం విద్యార్థులు బడుగు బలహీన వర్గాల గిరిజన విద్యార్థులు ఉన్నారని అలాంటి వారిని విద్యకు దూరం చేసే కుట్రలో బాగంగానే ఇలాంటి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమిస్తుందని విమర్శించారు.రేషన లైజేషన్ పేరిట బడులు మూతకు ప్రభుత్వం పూనుకున్నదని ఆరోపించారు.విద్య హక్కు చట్టం ప్రకారం ప్రతి కిలోమీటర్ దూరంనకు ఒక ప్రాథమిక పాఠశాల ఉండాలని కానీ ప్రస్తుత ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇష్ట రీతిగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోవైపు ఉపాధ్యాయులకు వేతనాలు ఎక్కువయ్యాయని సభల్లో పదే పదే పేర్కొనడం ఉపాధ్యాయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటమే అని అన్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో 27 వేల పాఠశాలలు ఉండగా 4 వేల పాఠశాలలే సరిపోతాయని ముఖ్యమంత్రి మాట్లాడటం విడ్డూరంగా ఉందని అన్నారు.దీన్నిబట్టి చూస్తే భవిష్యత్తులో బడుగు,బలహీన వర్గాల పిల్లలకు విద్య అంధదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని,ఇది కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించేలా ఉందని అన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వ వైఖరి మారాలని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *