ప్రజా సంక్షేమమే కాంగ్రేస్ ప్రభుత్వ ప్రజాపాలన లక్షం

ఎంఎల్ఎ కోరం కనకయ్య

మహా తెలంగాణ/గార్ల

అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రేస్ ప్రభుత్వం ప్రత్యేక పాధాన్యత ఇస్తు సంక్షేమమే లక్షంగా పనిచేస్తుందని ఇల్లందు నియోజకవర్గ ఎంఎల్ కోరం కనకయ్య అన్నారు. మండల కేంద్రంలోని సొపైటీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి షాదిముభారక్,సిఎం రిలీఫ్ పండ్ చెక్కుల పంపిణి కార్యక్రమంలో ముఖ్యఅతిదిగా పాల్గోన్న ఎంఎల్ఎ సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్, సర్పంచ్లు, అధికారులతో కలిసి లబ్దిదారులకు చెక్కులను పంపిణి చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడబిడ్డల వివాహలకు ఆర్ధిక భరోసా కల్పించెందుకు స్పభుత్వం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తుందని అన్నారు. అనారోగ్యం, ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో ఆర్ధిక ఇబ్బందులు ఎదురుకుంటున్న కుటంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం చేయూత నిస్తుందని అన్నారు. నిరుపేదలకు వరంగా మారిన సిఎం రిలీఫ్ పండ్ ను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, బానోత్ పార్వతి, గంగావత్ రామసింగ్ నాయక్, భూక్య రాంమ్ సింగ్, మంగీలాల్, గుగులోత్ వీర్యా, సిద్దబోయిన వెంకటరావు, గుగులోత్ భద్రు, కేలోత్ వీరన్న, తహశిల్దార్ శారధ, ఎంపిడిఓ మంగమ్మ తదితరులు పాల్గోన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *