ఏ ఓ కె రామారావు
మహా తెలంగాణ /గార్ల :
భూమి సారాన్ని పెంచడంతో పాటు పంట దిగు బదులు మెరుగుపడేందుకు జీలుగు సాగు రైటుకు ఎంతో ఉపయోగపడుతుందని ఏ ఓ కావటి రామారావు ఆదివారంనాడు పత్రికా ముకంగా సూచించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతు సోదరులు ముఖ్య ప్రధాన పంట సాగుకు ముందు తప్పనిసరిగా పచ్చి రొట్ట విత్తనాలు జీలుగ జనుము పెసర వంటివి చల్లుకొని 45 రోజుల తర్వాత భూమిలో కలియదున్నడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. నేల సారవంతం అవుతుంది.సేంద్రియ పదార్ధం పెరిగి నేల నిర్మాణం మెరుగుపడుతుంది, నత్రజని నేలకు అందుతుంది.. రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుందని,నేల లో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని,సూక్ష్మ జీవుల కార్యకలాపాలు పెరిగి నేల ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా కలుపు పెరుగుదల తగ్గి, నేల గుల్ల బారి వేరు బాగా వృద్ధి చెందుతుందన్నారు. పంట దిగుబడి పెరుగుతుంది కావున తప్పనిసరిగా వ్యవసాయానికి వాడాలని తెలిపారు. సొసైటీ,ఏఆర్ ఎస్ కె,2 లో జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి కావలసిన రైతులు ఆధార్, పట్టాదార్ పాసుబుక్ జిరాక్స్ లతో వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని తెలిపారు.