జిఈసీవో యద్దనపూడి గాయత్రి
మహాతెలంగాణ/ మహబూబాబాద్:
ఈనెల 15 నుంచి ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం జిల్లాలోని 16 కేజీబీవీలను పండుగ వాతావరణం లో ప్రారంభించాలని, విద్యార్థినులకు ఘనంగా స్వాగతం పలకాలని మహబూబాబాద్ GECO యద్దనపూడి గాయత్రి ఎస్ఓ కు సూచించారు. బుధవారం మహబూబాబాద్ కేజీబీవీ ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఎంఆర్సి నుంచి పాఠశాలలకు వచ్చిన పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ ప్రోగ్రెస్ కార్డులు నమోదు చేసిన స్టాక్ రిజిస్టర్ ను, పాఠ్యపుస్తకాల స్టాక్ రూమ్ ను, సైన్స్ ల్యాబ్ పరిశీలించారు. ఇప్పటివరకు మహబూబాబాద్ కేజీబీవీ హై స్కూల్ లో 51 అడ్మిషన్లు, కాలేజీలో 32 అడ్మిషన్లు పూర్తయ్యాయని 15వ తేదీ నాటికి అన్ని తరగతుల్లో అడ్మిషన్లు పూర్తయ్యాలా బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. అలాగే బాలికల క్యాంపస్ కావడంతో ఎలాంటి సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు నిత్యం పనిచేసేలా చూడాలని ఎస్ఓలకు సూచించారు. సీసీ కెమెరా టెక్నీషియన్ ను తీసుకువెళ్లి చూపించడంతో మరమ్మతు చేశారు. అలాగే స్నానాలు గదులు మరుగుదొడ్లు కూడా రిపేర్లు ఏమైనా ఉంటే చేయించాలని, వాటర్ ట్యాంకును శుభ్రం చేయించి ప్రారంభోత్సవం నాటికి సిద్ధంగా ఉంచాలని ఎస్ఓలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఎస్ఓ భవాని సిఆర్టి, సిబ్బంది పాల్గొన్నారు.