ఘనంగా వాసవి క్లబ్ డాన్ టు డస్క్ కార్యక్రమం

మహా తెలంగాణ/మరిపెడ

వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పిలుపుమేరకు శనివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వాసవి క్లబ్ వాసవియన్ కెసిజిఎఫ్ గర్రెపల్లి నాగేష్ ,వాసవి క్లబ్ వనిత వాసవియన్ కెసిజిఎఫ్ గర్రెపల్లి హరిత లా అధ్యక్షతన డాన్ టు డస్క్ ఉదయాస్తమాన సేవ కార్యక్రమంలో భాగంగా మొదటగా ప్రభుత్వ పాఠశాలలో ఫస్ట్ ఎయిడ్ కిట్ అందజేసి,20 మంది విద్యార్థులను శాలువాతో సత్కరించారు.అనంతరం వాసవి క్లబ్ భవన్ లో ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ పోస్టర్ ని, బ్లడ్ డోనార్స్ పోస్టర్ ని ఆవిష్కరించారు.మొక్కలు నాటి వాటికి గార్డ్స్ ని ఏర్పాటు చేసి,గోవుల కోసం గోశాలకి ధన రూపేన సహాయం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిలుగా వాసవియన్ సిల్వర్ కెసిజిఎఫ్ దొంతు పాండు రంగయ్య- ఇంటర్నేషనల్ కార్పొరేట్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్, గెస్ట్ ఆఫ్ హానర్ గా వాసవియన్ ప్రోగ్రెసివ్ సిల్వర్ కెసిజిఎఫ్ చకిలం రాజేశ్వర రావు- ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ లు హాజరయ్యారు.ఈ కార్యక్రమములో రీజనల్ చైర్మన్ గర్రెపల్లి వెంకన్న,జోన్ చైర్మన్ తల్లాడ చంద్రమోహన్,అధ్యక్షులు గర్రెపల్లి నాగేష్ హరిత,సెక్రటరీ కటకం కిషోర్ స్వాతి,ట్రెజరర్ మురారిశెట్టి రాజు నవ్య,గర్రెపల్లి మంజుల,ఉప్పల నాగేశ్వరరావు,వంగపల్లి భరత్ కుమార్,ఉల్లి శ్రీనివాస్ శిరీష, వంగవీటి భద్రయ్య సుభద్ర,ఉప్పల రాంబాబు,తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *