దైవానుగ్రహంతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి

ప్రజలందరూ అష్టైశ్వర్యాలు,ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలి..

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత కలిగి ఉండాలి

ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్

నేతావత్ పర్కజాల తండాలో ఘనంగా బొడ్రాయి,శ్రీ అభయాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం

మహా తెలంగాణ/మరిపెడ :

దైవానుగ్రహంతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని,ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలు,ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ప్రభుత్వ విప్,డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ ఆకాంక్షించారు.శనివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం నేతావత్ పర్కజాల తండాలో శ్రీశ్రీశ్రీ శ్రీలక్ష్మి,శ్రీ భూలక్ష్మి నాభిశిల శీతల పరమేశ్వరి (బొడ్రాయి) సహిత శ్రీ అభయాంజనేయస్వామి వారి స్థిర విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాలు గ్రామ సర్పంచ్ బానోతు కొండయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామదేవతల ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికత కలిగి ఉండి భక్తిభావంతో మెలగాలని సూచించారు.ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలిపారు.గ్రామ దేవతల అనుగ్రహం అందరిపై ఉండాలని,దేవుని ఆశీస్సులతో పాడి పంటలు సంవృద్ధిగా పండి గ్రామం సుభిక్షంగా ఉండాలని,ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు గుగులోత్ రవి నాయక్,నీలికుర్తి సర్పంచ్ తొట్టి గౌతం,ప్రజాప్రతినిధులు,మాజీ ప్రజాప్రతినిధులు,గ్రామ పెద్దలు,భక్తులు,తండావాసులు తదితరులు పాల్గొన్నారు

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *