ఆహారం అందించి ఆకలి తీర్చాలి

లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొండపల్లి కరుణాకర్ రెడ్డి

మహా తెలంగాణ/మహబూబాబాద్ :

ఆపదలో ఉండి ఆకలితో అలమటించే వారికి అన్నం పెట్టి కడుపు నింపే గుణం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని లయన్స్ క్లబ్ అధ్యక్షులు కొండపల్లి కరుణాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సహాయకులుగా వచ్చే వారికి ఆహారం అందించే కార్యక్రమం లయన్స్ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ ఆధ్వర్యంలో చేపట్టారు. మాజీ క్లబ్ సెక్రటరీ పరకాల రవీందర్ రెడ్డి, లక్ష్మీ దంపతుల కుమార్తె మర్రి ప్రియ రాగా రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కరుణాకర్ రెడ్డి అధ్యక్షత వహించగా ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ బి. జగదీశ్వర్ పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులకు నిరుపేదలే అత్యధికులు చికిత్స కోసం వస్తుంటారన్నారు. వారు తిరిగి కోలుకునే వరకు వారికి సహాయకులుగా కొద్ది రోజులు ఆసుపత్రి వద్ద పడిగాపులు పడాల్సివస్తోందని, ఈ సమయంలో వారికి ఆహారం లేక అగచాట్లు పడాల్సిందే అని ఆవేదన వ్యక్తంచేశారు. అలాంటి వారు వందల సంఖ్యలోనే ఉంటారని, వారి పరిస్థితి తెలుసుకొని వారికి ఆహారం అందించాలని ముందుకురావడం సంతోషంగా ఉందన్నారు. తమ కూతురు పుట్టినరోజు సందర్భంగా తమ బంధుమిత్రులతో వేడుకలు జరుపుకోకుండా ఆస్పత్రిలో రోగుల సహాయకుల కడుపు నింపాలని యోచించి ఆహారం అందించాలని ముందుకు వచ్చిన తమ క్లబ్ సభ్యులు పరకాల రవీందర్ రెడ్డి దంపతుల సేవలను కొనియాడారు. ఇకముందు కూడా తమ క్లబ్ ఆధ్వర్యంలో తరచు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ పారుపల్లి రమేష్, సభ్యులు డాక్టర్ బి. వీరన్న, డాక్టర్ బొడ్ల మదుసూధన్ రావు, పీ.వీ. ప్రసాద్, బవిరిశెట్టి నాగేశ్వర్ రావు, వేమిశెట్టి ఏకాంబరం, మాలె కాళీనాధ్, వాకర్స్ కాఫీ క్లబ్ సభ్యులు వంగ రామన్న గౌడ్, ఆకుల రాజు, చిదిరాల శరత్ కుమార్, కొల్లూరు రవికుమార్, మాలె హేమచందర్, ఆరీఫ్, ఎం.ఏ. ఫయీజ్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సేవా ట్రస్ట్ ప్రతినిధులు గరిపల్లి నవీన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *