మహా తెలంగాణ/మహబూబాబాద్:
YIIOE (యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ )కె జి బి వి ల్లో ఇంటర్మీడియట్ లో చేరే విద్యార్థినులకు స్పాట్ అడ్మిషన్స్ కు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు సర్వశిక్ష జిఇసిఓ వై గాయత్రి ఒక ప్రకటనలో తెలిపారు. ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ కెజిబివి బైపిసి లో 16సీట్లు, గూడూరు ఎం పి సిలో 15సీట్లు, బయ్యారం సిఇసి గ్రూపులో 14సీట్లు ఉన్నట్లు తెలిపారు ఆయా గ్రూపుల్లో చేరెందుకు ఈ నెల 17న స్పాట్ అడ్మిషన్స్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థినులు కేజీబీవీ, ప్రభుత్వ పాఠశాలల్లో లో చదివిన విద్యార్థినులు, అర్పన్స్ సెమి అర్పన్స్ విద్యార్థినులకు ప్రాధాన్యత ఉంటుందని ఆమె తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థినిలు ఈనెల 17న ఉదయం 10 గంటలకు హాజరై ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా జిఈసిఓ గాయత్రి తెలిపారు.