తోడేటి ఉమా పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
మహా తెలంగాణ/గార్ల
మలిదశ ఉద్యమ కారుడు వార్డు సభ్యుడు తోడేటి శ్రీనివాస్ భార్య ఉమ అనారోగ్యంతో బుధవారం మరణించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య మండల కేంద్రంలోని వారి నివాసంలో ఉమా పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తోడేటి శ్రీనుని వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఎమ్మెల్యేతో పాటు గార్ల సొసైటి చైర్మెన్ వడ్లముడి దుర్గాప్రసాద్, స్ధానిక సర్పంచ్ పార్వతి ఉప సర్పంచ్ జరీనా బేగం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షలు తాళ్ళపల్లి క్రిష్ణ గౌడ్, మాజీ మార్కెట్ చైర్మెన్ భుక్యా నాగేశ్వరరావు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.