సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం సప్లై కేంద్రం పనులు వేగవంతం చేయాలి

జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి

కేసముద్రం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం సప్లై కేంద్రం పనులు వేగవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి ఆదేశించారు.
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశాల మేరకు కేసముద్రం కేంద్రంగా హరికృష్ణ మూమెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో సప్లై చేసే సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం కేంద్ర ప్రాంతమైన కేసముద్రం మార్కెట్ యార్డ్ గోదాంను ఖాళీ చేయించే పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాం ఖాళీ చేసే సంధాని కంపెనీ వారితో డిఇఓ మాట్లాడుతూ ఇప్పటివరకు 30% మాత్రమే గోదాం ఖాళీ చేశారని మిగతా 70% గోదాం ఖాళీ చేసే పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మరిన్ని లారీలను ఏర్పాటు చేసి త్వరగా ఖాళీ చేస్తే సీఎం బ్రేక్ పథకం అత్యంత త్వరలో ప్రారంభమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఈఓ తో పాటు జిఈసిఓ వై. గాయత్రి పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *