కేసముద్రం కేజీబీవీ నూతన భవనం ప్రారంభానికి సిద్ధం చేయాలి

విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలి

జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి

మహా తెలంగాణ/కేసముద్రం:

15 రోజుల్లో కస్తూర్బా విద్యాలయం నూతన భవనం ప్రారంభానికి సిద్ధం చేయాలని, దాంట్లో భాగంగా అప్డేట్ ట్రాన్స్ఫార్మర్ కోసం విద్యుత్ ఏడి తో డిఇఓ మాట్లాడారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశాల మేరకు గురువారం కేసముద్రం కేజీబీవీ నూతన భవన నిర్మాణాన్ని డిఇఓ సత్యనారాయణమూర్తి , జిఇసీఓ గాయత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రాన్స్ఫార్మర్ కు సంబంధించిన డిడి రెండు రోజుల్లో అందజేస్తామని డీఈవో ఏడికి తెలిపారు. అనంతరం కస్తూర్బా విద్యాలయం (కేజీబీవీ) ని వారు తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను తరగతి గదులను, పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇన్చార్జి ఎస్ఓ, ఏఎన్ఎం కు డిఇఓ సూచించారు. అనంతరం సి ఆర్ టి లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఇఓ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని, ఇంగ్లీషులోనే బోధన చేయాలని, ఐఎఫ్ బి ప్యానల్స్ ఉపయోగించి బోధన చేయాలని నాణ్యమైన బోధన అందించి ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా తరగతులను నిర్వహించాలని సూచించారు. విద్యార్థినుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు ఇన్స్పైర్ లాంటి నామినేషన్లు పెంచాలని అన్నారు. పాఠశాల స్థాయిలో అమలవుతున్న ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా, డిజిటల్ లెర్నింగ్ కార్యక్రమాలను విద్యార్థులచే చేయించాలని డిఇఓ సూచించారు. జిఈసిఓ గాయత్రి మాట్లాడుతూ లిప్ లో భాగంగా బేస్ లైన్ టెస్ట్ విద్యార్థులకు నిర్వహించి, రికార్డులను ఆన్లైన్ చేయాలని, ఎఫ్ ఏ-1 విషయాలవారీగా నిర్వహించాలని, వాటి రికార్డులు మెయింటైన్ చేయాలని ఆమె సూచించారు. వార్షిక, పాఠ్య, పీరియడ్ ప్రణాళికలు రాయాలని, పాఠశాల అంతర్ పర్యవేక్షణ తరం కొనసాగించాలని ఇన్చార్జి ఎస్ ఓ కు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎస్ ఓ అర్చన, సిఆర్టి లు, పిజి సిఆర్టీలు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *