మహాతెలంగాణ/ కేసముద్రం:
జిల్లాలోని కేసముద్రం మండలం కల్వల మోడల్ స్కూల్ బాలికల హాస్టల్ విద్యార్థినులకు శుక్రవారం జిసిడిఓ వై. గాయత్రి ఆధ్వర్యంలో ప్లేట్లు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిసిడిఓ గాయత్రి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పీ. నవీన్ విద్యార్థులను నిద్దేశించి మాట్లాడుతూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ప్రభుత్వానికి, మోడల్ స్కూల్ కు, మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. చదువుతోపాటు మీలో ఉన్న సృజన సృజనాత్మకతను ప్రపంచానికి తెలియజేయాలని విద్యార్థినులకు వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు సురేందర్, హాస్టల్ ఏఎన్ఎం మమత, విద్యార్థినులు పాల్గొన్నారు.