మహా తెలంగాణ/మహబూబాబాద్ :
TJAC, కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జయంతిని గురువారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా టీజేఏసీ కన్వీనర్ డాక్టర్ డోలి.సత్యనారాయణ మాట్లాడుతూ నీళ్లు, నిధులు,నియామకాలు కోసం తెలంగాణలోఅలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన జయశంకర్ సార్ చిరస్మరణీయుడు అని అన్నాడు. తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత జయశంకర్ సార్ 1996 నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం ఒక బలమైన తెలంగాణ నినాదాన్ని భావజాల వ్యాప్తిగా మలిచి తెలంగాణ పౌర సమాజాన్ని ఐక్యం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కృషి చేయడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రం రాకముందుకే ఆయన మరణించడం శోచనియం.ఆయన ఇచ్చిన పిలుపుమేరకు యావత్ తెలంగాణ సమాజం పార్టీలకతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా,భావజాలానికి అతీతంగా, ఒకటై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది.తెలంగాణ కోసం ఆయన వేసిన ఒక్క అడుగుతో వేలాదిమంది, లక్షలాదిమంది, కోట్లాదిమంది స్పందించి తెలంగాణ ఉద్యమంలో మమేకమవడం జరిగింది.ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే దానికి ముఖ్యకారకుడు ప్రొఫెసర్ జయశంకర్ వల్లనే. కానీ ఇవాళ చాలామంది తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ ను విస్మరిస్తున్నారు. ఇది క్షమించరానిది భావితరాలకు సంబంధించి తెలంగాణ సమాజం ఆయనను స్మరించుకోవడం జరగాలి
ఈ కార్యక్రమం లో కళాకారుల చేసి కంబాలపల్లి సత్యనారాయణ,కోమేరే వెంకన్న, ఐలేష్ నలంద కళాశాల ప్రిన్సిపల్ కృష్ణ ప్రసాద్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీపాల్ రెడ్డి, బుర్ర గోవర్ధన్, శంకర్, పుల్లయ్య, ముత్తయ్య మరియు కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు