ఎస్ జి ఎఫ్ జిల్లా సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి
మహబూబాబాద్/మహాతెలంగాణ :
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రభుత్వ గుర్తింపు పొంది క్రీడల ద్వారా ప్రయోజనాలు పొందే క్రీడల్లో జాతీయస్థాయిలో రాణించేలా ఫిజికల్ డైరెక్టర్లు వ్యాయామ ఉపాధ్యాయులు కృషి చేయాలని మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి ఎ. సత్యనారాయణమూర్తి సూచించారు. బుధవారం స్థానిక లయన్స్ క్లబ్ హాలులో ఎంఈఓ ఎన్ వెంకటేశ్వరావు అధ్యక్షతన నూతన ఎస్ జి ఎఫ్ సెక్రటరీ ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన స్కూలు గేల్స్ ఫెడరేషన్(ఎస్ జి ఎఫ్ ) జిల్లా సమావేశంలో డివో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ వివిధ స్థాయిల్లో క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులకు వారి ప్రతిభ ద్వారా లభించిన ప్రశంసా పత్రాలు వారి భవిష్యత్తుకు ఉపయోగపడాలని, రేపటి తరాలకు క్రీడలు అందించేలా పనిచేయాలని అటువంటి క్రీడల్లో వ్యాయామ ఉపాధ్యాయులు నిత్యం విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని అన్నారు. జిల్లాలో ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రస్థాయి క్రీడలు క్రమశిక్షణతో నిర్వహించాలని జిల్లాకు సత్కారాలు లభించేలా మంచి పేరు తీసుకువచ్చేందుకు కృషి చేయాలని ఆకాంక్షించారు. రాష్ట్రస్థాయి క్రీడలకు వివిధ జిల్లాల నుంచి వచ్చే క్రీడాకారులకు వసతి సౌకర్యాలతో పాటు మూడు పూటల భోజనం, క్రీడాకారులకు ప్రాంగణంలో అంబులెన్స్ సౌకర్యం, ఫస్ట్ ఎయిడ్, మంచినీటి సౌకర్యం, వేసవిలో నీడ కల్పించేలా టెంట్ సౌకర్యం, వంటి సౌకర్యాలు నిర్వాహకులు కల్పిస్తేనే క్రీడా నిర్వహణ విజయవంతం అవుతుందని డిఈఓ సూచించారు. అప్పుడే జిల్లాకు మంచి సత్కారాలు పేరు ప్రతిష్టలు లభిస్తాయి అని ఆ దిశగా ఎస్ జిఎఫ్ సెక్రటరీ, కమిటీ కృషి చేయాలని అందుకు జిల్లాలోని వ్యాయామ ఉపాధ్యాయులు అవిశ్రాంత కృషి చేయాలని డిఇఓ సూచించారు. ఇప్పటివరకు మహబూబాబాద్ జిల్లాకు ఎస్ జి ఎఫ్ క్రీడల్లో ఐడెండిటీ లేదని నూతన ఎస్ జి ఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో క్రీడల్లో జిల్లాకు గుర్తింపు లభించేలా కృషి చేయాలని డిఇ ఓ ఆకాంక్షించారు. కొన్ని పాఠశాలల్లో క్రీడా పరికరాల బూజు దులపాలని ప్రతి పరికరం ఉపయోగంలోకి తీసుకువచ్చి క్రీడాకారులను తయారు చేయడానికి ఉపయోగించాలని సూచించారు. పిఎం శ్రీ పాఠశాలలో పెరిగేడా క్రీడా పరికరాలు కొనుగోలు చేయాలన్నారు. వేయామ ఉపాధ్యాయులు క్రీడా స్ఫూర్తితో విద్యార్థులను క్రీడల్లో రాణించేలా కృషిచేసి మహబూబాబాద్ జిల్లాను క్రీడల్లో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంచేందుకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీరోల్ ఎంఈఓ ఈ లచ్చిరాం నాయక్, డిఎస్ఓ అప్పారావు, డివైస్ ఓ జ్యోతి, మాజీ ఎస్జీఎఫ్ సెక్రటరీ గండి సత్యనారాయణ, చుంచు కొమ్మాలు, తొర్రూరు జోన్ సెక్రెటరీ వీరప్రసాద్, మహబూబాబాద్ జోన్ సెక్రెటరీ గుగులోతు శ్రీను నాయక్, మరిపెడ సెక్రటరీ భూక్య స్వప్న, నెల్లికుదురు సెక్రటరీ దామళ్ళ విజయ చందర్, గూడూరు సెక్రటరీ గల్గి లక్ష్మి జిల్లాలోని వివిధ యాజమాన్యాల పాఠశాలకు చెందిన పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.