మహా తెలంగాణ/మరిపెడ
80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శనివారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.మరిపెడ మున్సిపాలిటీలో మునిసిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి,మండల పరిషత్ కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీమన్నారాయణ,తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ కృష్ణవేణి లు జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కాలం సునీత రవీందర్ రెడ్డి,కౌన్సిలర్లు,మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డి,ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి,ఇతర అధికారులు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.