మహా తెలంగాణ/మరిపెడ
మరిపెడ పట్టణ కేంద్రంలోని హౌసింగ్ బోర్డు శివారులో ఉన్న బాలికల మదర్సా మదర్సా-ఏ-ఇస్లామియా రౌజతుల్ బనాత్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మదర్సా ప్రిన్సిపాల్ మౌలానా సాదిక్ హుస్సామి జాతీయ జెండాను ఆవిష్కరించారు.అనంతరం మదర్సా వైస్ ప్రిన్సిపాల్ హాఫీజ్ సాజిద్ విద్యార్థినులకు స్వాతంత్ర్య దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు.దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు పోరాడిన మహనీయుల త్యాగాలను,స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రను విద్యార్థినులకు వివరించారు.ఈ సందర్భంగా మదర్సాలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు షీల్డులు,దుస్తులను బహూకరించారు.ఈకార్యక్రమంలో జమీయత్ దీనీ తాలీమీ బోర్డు,మండల శాఖ కమిటీ సభ్యులు సయ్యద్ సర్వర్,రజబ్ అలీ,జేఏసీ సలీం, మక్సుద్,యాకూబ్ జానీ,అబ్బాస్ సబూర్,గౌస్ ఉద్దీన్,ఖాజాపాషా, మహబూబ్ హఫీజ్,ఇమాముద్దీన్ లాల్ సాబ్, అప్సర్ పాషా,అబ్దుల్ జబ్బర్,బాసుమియా,గౌస్,బాసిత్ ఖాన్.నాలుగో వార్డు అధ్యక్షుడు యాకూబ్ పాషా,అబ్దుల్ సత్తార్, మన్సూర్ అలీ, సలీం తదితరులు పాల్గొని విద్యార్థినులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు