విషపు పురుగు కరిచి వ్యవసాయ కూలి మృతి

మహాతెలంగాణ/మరిపెడ:

వ్యవసాయ క్షేత్రంలో కలుపు తీయడానికి కూలికి వెళ్లి గుర్తుతెలియని విషపు పురుగు కరిచి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది.సోమవారం మరిపెడ ఎస్సై గండ్రాతి సతీష్ తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సోమ్లా తండా జిపి పరిధిలోని బాధావత్ తండాకు చెందిన వ్యవసాయ కూలీ బాదావత్ భిక్య(48) ఆదివారం పొలంలో కలుపుతీస్తుండగా ఏదో గుర్తుతెలియని విషపు పురుగు కరవడంతో,గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం మహబూబాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కి తీసుకొని వెళ్లారు.హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న క్రమంలో అతడు చనిపోగా,మృతుని కుమారుడు బాదావత్ సాగర్ పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గండ్రాతి సతీష్ తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *